
Ramya: నటి రమ్యకు హత్య, అత్యాచార బెదిరింపులు.. ఆ హీరో ఫ్యాన్స్ ఓవరాక్షన్!
ఈ వార్తాకథనం ఏంటి
నటి రమ్య (దివ్య స్పందన) తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు దర్శన్ అభిమానుల నుంచి అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు, బెదిరింపులు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తన లాయర్‌తో చర్చించామని, తగిన ఆధారాలతో పోలీసులు ఎదుట ఫిర్యాదు చేస్తానని రమ్య స్పష్టం చేశారు. సోషల్‌మీడియా వేదికగా ఈ రకమైన వేధింపులు జరుగుతుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికను ఇలా అశ్లీలంగా వాడటం బాధాకరమన్నారు.
Details
దర్శన్ అభిమానులు అసభ్యకర ప్రవర్తన
ఇటీవలి కాలంలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్యకేసుపై రమ్య ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌పై దర్శన్ అభిమానులు అసభ్యకరంగా స్పందించారని ఆమె ఆరోపించారు. రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేసి ఉండాల్సింది, అత్యాచారం చేస్తాం అంటూ బెదిరింపులు కూడా పంపారని వివరించారు. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో పంచుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తుండటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.