
Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. వైరల్ అవుతున్న కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువగానే ఉన్నా, ఆమె చేసే వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ పెద్ద చర్చలకు కారణమవుతుంటాయి. తరచూ ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదే రీతిలో వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్లు చేసింది.
వివరాలు
నటనను వదిలిపెట్టే ఆలోచనే లేదు: రేఖ
ఆమె మాట్లాడుతూ.. "సినిమాల్లో నటించేందుకు నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను.గతంలో నేను 'సామీ సామీ' అనే కవర్ సాంగ్ చేశాను. ఆ పాట కోసం నా రెండు బంగారు గాజులు అమ్ముకున్నాను. ఆ సాంగ్ నాకు మంచి పేరు తెచ్చింది. అదే కారణంగా నాకు ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అలా నాకు సినీ పరిశ్రమలో గుర్తింపు దొరికింది.నాకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ నటనను వదిలిపెట్టే ఆలోచనే లేదు. అవసరం అయితే నా కిడ్నీ అమ్ముకుని అయినా నేను నా స్వంతంగా సినిమా తీస్తాను. గత మూడు సంవత్సరాలుగా చాలా మంది నాకు 'కమిట్‌మెంట్' ఆఫర్లు ఇస్తున్నారు.
వివరాలు
నా స్వంత ప్రతిభతోనే ఎదగాలని అనుకుంటున్నాను: రేఖ
వాళ్లకు కమిట్‌మెంట్ ఇస్తే బిల్డింగ్, కారు, ఫ్లాట్ ఇస్తామని చెబుతున్నారు. కానీ నేను ఆ ఆఫర్లన్నిటినీ తిరస్కరించాను. ఒకవేళ వాళ్లు అడిగినట్టుగా నేను అంగీకరించి ఉంటే, ఈ సమయానికి నేను సుఖంగా సెటిల్ అయిపోయేదాన్ని. కానీ నాకు అలా సెటిల్ కావడం ఇష్టం లేదు. నా స్వంత ప్రతిభతోనే ఎదగాలని అనుకుంటున్నాను. నేటికీ నేను నిజాయితీగా జీవిస్తున్నాను, అందుకే నా వద్ద పెద్దగా డబ్బులు లేవు," అని రేఖా స్పష్టంగా తెలిపింది.