ఆదిపురుష్: హనుమంతుడి పక్కన సీటు ఖరీదుపై నిర్మాణ సంస్థ క్లారిటీ
ప్రభాస్ రాముడిగా రూపొందిన ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతీ థియేటర్లో ఒక ఖాళీ సీటును వదిలివేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రామాయణం పారయణం జరిగే ప్రతీచోటా హనుమంతుడు ఉంటాడని పాటించే పద్దతిలో భాగంలో ఇలా సీటును వదిలేస్తున్నారు. అయితే, ఇప్పుడు హనుమంతుడి పక్కన సీటు ఖరీదు గురించి ఇంటర్నెట్ లో చర్చలు జరుగుతున్నాయి. హనుమంతుడి పక్క సీటు ఖరీదు ఎక్కువగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ టీ సిరీస్ స్పందించింది. హనుమంతుడి పక్కన సీటు ఖరీదు కూడా ఇతర సీట్ల ఖరీదులాగే ఉంటుందని, ఎలాంటి తేడా ఉండదని, పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం, జూన్ 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుంది.