ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్రం, మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి. తెలంగాణలో నేటినుంఛి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మొదటిరోజున ఆదిపురుష్ సినిమాకు పెద్ద ఎత్తున వసూళ్ళు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే అందరి కన్ను జూన్ 16వ తేదీపైనే ఉంది. అదలా ఉంచితే, తాజాగా ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ పై వార్తలు వస్తున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఆదిపురుష్ స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్నారని అంటున్నారు. అయితే అన్ని సినిమాలలా కాకుండా ఆదిపురుష్ సినిమా కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి రాబోతుందట.
8వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్
థియేటర్లలో విడుదలైన 8వారాల తర్వాత మాత్రమే ఓటీటీలోకి ఆదిపురుష్ వస్తుందని సమాచారం. అంటే ఆగస్టు 2వ తేదీ తర్వాతే వచ్చే అవకాశం ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేకపోయాయి. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు. ప్రస్తుతం రిలీజ్ కానున్న ఆదిపురుష్, ఆ లోటును తీరుస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు సినిమా మీద నమ్మకాన్ని బాగా పెంచాయి. మునుపెన్నడూ చూడని విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇందులో కనిపించబోతున్నాయని, కన్నుల పండగలా సినిమా ఉండబోతుందని ఆల్రెడీ ముంబై నుండి టాక్ అందుతోంది.