తిరుపతి దేవాలయంలో క్రితి సనన్ కు ఓం రౌత్ ముద్దు పెట్టడంపై చెలరేగుతున్న వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకుడు ఓం రౌత్ చేసిన పని, వివాదానికి దారితీసింది.
తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఓం రౌత్, ఆలయ పరిసరాల్లో క్రితి సనన్ ను కలుసుకొని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు.
ఇప్పుడు దీనిపై వివాదం చెలరేగుతుంది. ఆలయ పరిసరాల్లో ముద్దు పెట్టడం సరికాదని, అది అమర్యాద అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజెపి కార్యదర్శి, రమేష్ నాయుడు నాగోతు ట్వీట్ చేశారు.
ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లాంటివి ఆలయ పరిసరాల్లో చేయకూడదని అన్నారు. అయితే ఆ తర్వాత ఈ ట్వీటును డిలీట్ చేసారు.
Details
వివాదంపై ప్రభాస్ అభిమానుల మాట
సోషల్ మీడియాలో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఈ చర్య పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఈ చర్య గురించి కొంతమంది ప్రభాస్ అభిమానులు మాట్లాడుతూ, ఓం రౌత్ గుడ్ బై కిస్ ఇచ్చారని, అందులో అసభ్యం ఏమీ లేదని అంటున్నారు.
అదలా ఉంచితే, ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాపై అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయి. ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఈ సినిమా, ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సుమారు 500కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. మొదటిసారిగా రామాయణ కథను ఆదిపురుష్ ద్వారా త్రీడీలో చూడబోతున్నారు.
ఇప్పటివరకు విడుదలైన రెండు ట్రైలర్లు, సినిమా మీద ఆసక్తిని మరింతగా పెంచేసాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదలవుతుంది.