NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 
    ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 
    1/2
    సినిమా 0 నిమి చదవండి

    ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 17, 2023
    10:59 am
    ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 
    ట్రిబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు

    ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ నటి క్రితి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. వాల్మీకీ రామాయణాన్ని వెండితెర అద్భుతంగా ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా, జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే జూన్ 13,15,17 తేదీలలో అమెరికాలోని ట్రిబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో ఆదిపురుష్ ప్రీమియర్లు పడనున్నాయని మేకర్స్ తెలియజేసారు. ప్రస్తుత సమాచారం ప్రకారం జూన్ 13న జరిగే ప్రీమియర్ షో రద్దయ్యింది. 15, 17తేదీల్లోని షోస్ మాత్రం యధావిధిగా జరగనున్నాయట. మరి 13వ తేదీన జరిగే షోని ఎందుకు క్యాన్సిల్ చేసారనేది ఇంకా తెలియలేదు. ఆదిపురుష్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఈ అంచనాలు మరింత పెరిగాయి.

    2/2

    గ్రాఫిక్స్ రిపేర్లకు 100కోట్లు 

    టీజర్ రిలీజ్ అయినపుడు జరిగిన ట్రోలింగ్, ట్రైలర్ రిలీజ్ కావడంతో పూర్తిగా ఆగిపోయింది. పైగా ట్రైలర్ పై ప్రశంసలు కురిసాయి. టీజర్ లోని లోపాలను ట్రైలర్ లో సరిదిద్దారు. గ్రాఫిక్స్ రిపేర్లు చేయడానికి అదనంగా 100కోట్లు అయ్యాయని సమాచారం. త్రీడీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా, తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, ఓం రౌత్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    ఆదిపురుష్
    ప్రభాస్

    తెలుగు సినిమా

    హ్యాపీ బర్త్ డే ఛార్మి: హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి జీవితంలోని ఆసక్తికర విషయాలు  పుట్టినరోజు
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్ సినిమా రిలీజ్
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  వరుణ్ తేజ్
    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే  ఓటిటి

    ఆదిపురుష్

    ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే  ప్రభాస్
    ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్  తెలుగు సినిమా
    ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు  ప్రభాస్
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం  ప్రభాస్

    ప్రభాస్

    సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే?  సినిమా రిలీజ్
    లవ్ స్టోరికి ఓకే చెప్పిన ప్రభాస్.. టాలెంటెడ్ దర్శకుడితో మూవీ ప్లాన్! సినిమా
    అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే  సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023