
జూబిలి స్క్రీనింగ్ కోసం సిద్ధార్థ్ వెంట వచ్చిన అదితి, పుకార్లకు మరింత బలం
ఈ వార్తాకథనం ఏంటి
సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సమ్మోహనానికి గురి చేసిన భామ అదితి రావ్ హైదరీ, గతకొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ ప్రేమలో ఉందని అనేక పుకార్లు షికార్లు చేసాయి.
సిద్ధార్థ్, అదితి.. ఇద్దరూ సహజీవనంలో ఉన్నారని లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయమై ఇప్పటివరకు ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. దాంతో ఆ పుకార్లు మరింత పెరిగాయి.
తాజాగా సిద్ధార్థ్, అదితి.. ఇద్దరూ ఒక ఈవెంట్ కి అతిధిగా వచ్చారు. అదితి రావ్ హైదరీ నటించిన జూబిలి సిరీస్ స్క్రీనింగ్ కోసం ఇద్దరూ వచారు.
దాంతో మీడియా వారందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరో ఒకరు లవ్లీ జోడీ అని, బ్యూటిఫుల్ కపుల్ అని గట్టిగా అరిచారు.
అదితి రావ్ హైదరీ
ఫోటోలకు ఫోజులిచ్చిన అదితి, సిద్ధార్థ్
ఫోటోలకు ఫోజులిచ్చిన అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ అక్కడి నుండి వెనుదిరిగారు. జూబిలి స్క్రీనింగ్ కి వచ్చినట్లు అదితి రావ్ హైదరీ తన సోషల్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.
అందులో జూబిలి సిరీస్ కు పనిచేసిన వారితో పాటు హీరో సిద్ధార్థ్ కూడా ఉన్నారు.
అదితి రావ్, సిద్ధార్థ్ కలిసి మహాసముద్రం సినిమాలో కనిపించారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయం అందుకున్న అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు.
ఇకపోతే జూబిలి సిరీస్ ని విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించారు. అదితి ప్రధాన పాత్రలో కనిపించే ఈ సిరీస్, 2023 ఏప్రిల్ 7వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది.