Page Loader
Adivi Shesh : విడుదలైన 'డెకాయిట్' గ్లింప్స్.. 

Adivi Shesh : విడుదలైన 'డెకాయిట్' గ్లింప్స్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువహీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం 'డెకాయిట్'. ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నది షనీల్ డియో కాగా, చిత్రాన్ని నిర్మిస్తున్నది సుప్రియా యార్లగడ్డ. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్, షనీల్ డియో కలిసి సిద్ధం చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినీ అనుభూతిని అందించబోతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్యే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.

వివరాలు 

ఇద్దరు ప్రేమికుల కథ ఆధారంగా సినిమా 

గతంలో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అడివి శేష్ తీవ్ర భావోద్వేగాలతో ట్రైన్, కారు పేలుడు ఘటనను తిలకిస్తున్న దృశ్యం చూపించగా, తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో అదే ఫైర్ సీన్‌ను మరింత స్పష్టంగా ప్రదర్శించారు. గమనించదగ్గ విషయం ఏమంటే, ఈ గ్లింప్స్‌ ఎక్కడా కథను బయటపెట్టకుండా ఎంతో ఆసక్తికరంగా కట్ చేయబడ్డాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇద్దరు ప్రేమికుల కథ ఆధారంగా సాగుతుంది. వారు గతంలో ప్రేమలో ఉండగా, విడిపోయిన తర్వాత జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పేందుకు వరుసగా దోపిడీలకు ప్రణాళిక వేస్తారు. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేవి ఈ సినిమాకు అసలు కథాంశం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అడివి శేష్ చేసిన ట్వీట్