Dacoit Teaser: అడివి శేష్-మృణాల్ ఠాకూర్ 'డెకాయిట్' టీజర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'డెకాయిట్'. దీనికి 'ఒక ప్రేమ కథ' అనే ఉపశీర్షికను జత చేశారు. ఈ సినిమాతో షానీల్ డియో అనే కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. నాగార్జున నటించిన సినిమాలోని ఐకానిక్ పాట 'కన్నెపిట్టరో కన్నుకొట్టరో'ను బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగిస్తూ టీజర్ ప్రారంభమవుతుంది.
వివరాలు
యాక్షన్‌కు ప్రాధాన్యం ఉన్న డ్రామాగా టీజర్
ఆపై యాక్షన్‌కు ప్రాధాన్యం ఉన్న డ్రామాగా టీజర్ సాగుతుంది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ దొంగల పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫుల్ యాక్షన్ డ్రామాగా అడివి శేష్ 'డెకాయిట్'
The #DacoitTeaser is HERE.
— Adivi Sesh (@AdiviSesh) December 18, 2025
BOOM.💥 #DACOIThttps://t.co/WV3e1V7Fvq pic.twitter.com/iYZ8TISd6y