LOADING...
Adivi Sesh: సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను : అడివి శేష్
సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను : అడివి శేష్

Adivi Sesh: సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను : అడివి శేష్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

'టాక్సిక్‌ (Toxic) విడుదలపై నాకు ఎలాంటి ఆందోళనలు లేవు.నేను పెద్ద హంగామా చేసే వాడిని కాదు. నిశ్శబ్దంగా వచ్చి, నా సినిమాతో విజయం సాధించడం నా స్టైల్‌. ప్రేక్షకులు ఊహించని సమయంలో వారిని సర్ప్రైజ్ చేయడమంటే నాకు ఇష్టమని ఇప్పటికే రుజువైంది. అలాగే ఒకే రోజున రెండు సినిమాలు విడుదలై హిట్‌ అయిన ఉదాహరణలు సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం అసలు లేదు' అని అడివి శేష్‌ తెలిపారు. అడివి శేష్‌ హీరోగా,శానీల్‌ డియో (Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్న'డెకాయిట్‌' (Dacoit) లో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమైంది.అదే తేదీన యశ్‌ (Yash) నటించిన 'టాక్సిక్‌' కూడా థియేటర్లలోకి రాబోతోంది.

వివరాలు 

ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందనే నమ్మకం 

అందుకే ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్‌ పోటీ తప్పదు అన్న చర్చలు, కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఇప్పుడు అడివి శేష్ స్పందించారు. 'ఒకే రోజున రెండు సినిమాలు విడుదల అవడం కొత్త విషయం కాదు. అలా విడుదలై విజయాన్ని అందుకున్న సందర్భాలు పరిశ్రమలో చాలానే ఉన్నాయి.2018లో యశ్‌ నటించిన కెజీఎఫ్‌, షారుక్‌ జీరో ఒకేసారి వచ్చాయి. రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల ప్రేమ లభించింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది. రెండు సినిమాలు ఒకేసారి వచ్చాయంటే వాటిలో తప్పనిసరిగా ఒకటి ఫ్లాప్‌ అవుతుందనేది పూర్తిగా తప్పు భావన. చివరికి విజేత ఎవరో నిర్ణయించేది ప్రేక్షకులు మాత్రమే.

వివరాలు 

బాక్సాఫీస్‌ వార్‌' అనే పదం అసలు మీడియా సృష్టించినదే

ఇంతకుముందు కూడా లగాన్‌, గదర్: ఏక్ ప్రేమ్ కథ ఒకే రోజున విడుదలై రెండు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. 'బాక్సాఫీస్‌ వార్‌' అనే పదం అసలు మీడియా సృష్టించినదే. ప్రేక్షకులు దానికి విలువే ఇవ్వరు. కథ బాగుండటం, భావోద్వేగం కలగటం .. అదే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తుంది. అదే విడుదల సమయంలో పండగ వాతావరణం ఉంటే ఆ ఆనందం, హడావిడి మరింత పెరుగుతుంది' అని అడివి శేష్‌ చెప్పారు.

Advertisement