LOADING...
JanaNayagan : యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం.. జననాయగన్‌తో రికార్డుల వేట మొదలు
యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం.. జననాయగన్‌తో రికార్డుల వేట మొదలు

JanaNayagan : యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం.. జననాయగన్‌తో రికార్డుల వేట మొదలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'జననాయగన్'. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, నరైన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్‌గా నిలిచింది. విజయ్ చివరి సినిమా కావడంతో 'జననాయగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూకేలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.

Details

24 గంటల్లోనే 12.7 వేలకుపైగా టికెట్లు పైగా సేల్

బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 12.7 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడంతో తమిళ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. ఇంతకుముందు యూకేలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన తమిళ సినిమాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లియో' నిలిచింది. ఆ చిత్రం 24 గంటల్లో 10 వేల టికెట్లు అమ్ముడైంది. తాజాగా 'జననాయగన్' ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. విజయ్ నటించనున్న చివరి సినిమా కావడంతో, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే ఉత్సాహంతో అభిమానులు ఎదురుచూస్తున్న విషయం ఈ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇంతటి అంచనాల నడుమ 'జననాయగన్' 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement