NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా?
    తదుపరి వార్తా కథనం
    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా?
    మహేష్ బాబు 28వ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 30, 2023
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల మధ్య థియేటర్ల గురించి పెద్ద ఇష్యూ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాల మధ్య థియేటర్ల పంపకాల గురించిన చర్చ రోజూ వార్తల్లో వచ్చింది.

    చివరికి ఎలాగోలా మూడు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేసారు. సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ థియేటర్ల పంపకం విషయంలో దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించింది.

    నిర్మాత దిల్ రాజు, సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యే సినిమాలకు అడ్డం పడుతున్నారని కొందరు కామెంట్లు చేసారు. ప్రస్తుతం ఆ విషయం సద్దుమణిగిపోయింది.

    ఐతే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం, ఈసారి మహేష్ బాబు సినిమాకు పోటీగా మరో తమిళ మూవీని దిల్ రాజు తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    మహేష్ బాబు 28వ సినిమా

    రజనీకాంత్ జైలర్ సినిమా తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసే పనిలో దిల్ రాజు

    త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో మొదలైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం.

    మహేష్ బాబు 28వ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అదే టైమ్ లో రజనీకాంత్ జైలర్ కూడా విడుదల అవుతోంది.

    జైలర్ తెలుగు వెర్షన్ ని దిల్ రాజు తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో మరో మారు థియేటర్ల పంపకంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

    మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. జైలర్ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్
    Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025