
Vijay-Rashmika: గీత గోవిందం తర్వాత.. రష్మిక-విజయ్ కాంబినేషన్‌లో కొత్త యాక్షన్ డ్రామా!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందాన్న మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సినీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ జంట, ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా రూపొందుతోంది. ఈ సినిమాకు హైదరాబాద్‌లో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
Details
పల్లెటూరి యువకుడి పాత్రలో విజయ్ దేవరకొండ
విజయ్ - రష్మిక ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో కలిసి కనిపించడం, అలాగే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ప్రచారం ఈ ప్రాజెక్ట్ చుట్టూ మరింత హైప్‌ను సృష్టించింది. సినిమా కథ 1854 నుండి 1878 మధ్య జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ సీన్లు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ ఇప్పటికే ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ వంటి విభిన్న కాన్సెప్ట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో కూడా ఆయన సృజనాత్మకతను గరిష్టంగా ప్రదర్శించబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.