Ustaad Bhagat Singh : 'మీసాల పిల్ల', 'చికిరి చికిరి' తర్వాత ఇప్పుడు పవన్ టైమ్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల మెగా అభిమానులకు వరుసగా ట్రీట్స్ అందుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ నుంచి విడుదలైన 'మీసాల పిల్ల' పాట యూట్యూబ్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. అదే సమయంలో రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రంలోని 'చికిరి చికిరి' సాంగ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. విడుదలైన 35 గంటల్లోనే 53 మిలియన్ వ్యూస్‌ను దాటి రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు మెగా అభిమానుల దృష్టి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్‌శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'పై కేంద్రీకృతమైంది. ఈ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పవన్ స్టైలిష్ లుక్‌తో గూస్‌బంప్స్ తెప్పించింది. పవర్‌స్టార్ వింటేజ్ స్టైల్‌లో కనిపించడం అభిమానులను ఉత్సాహపరిచింది.
Details
పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా
ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుంది?" అనేది. ఓ అభిమాని ఈ ప్రశ్నను మైత్రీ మూవీ మేకర్స్‌కు అడగగా, వారు స్పందిస్తూ ఆన్ ది జాబ్. ఎక్స్‌పెక్టేషన్స్ అలానే హైలో ఉంచండి అని రిప్లై ఇచ్చారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. మెగాస్టార్ 'మీసాల పిల్ల సాంగ్ హిట్, రామ్‌చరణ్ 'చికిరి చికిరి' సాంగ్ ట్రెండ్, ఇక నెక్స్ట్ మన 'ఉస్తాద్ భగత్ సింగ్' టైమ్" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించబోతుండగా, ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీఖన్నా కనిపించనున్నారు.
Details
వచ్చే ఏడాది సమ్మర్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్
విలన్‌గా పార్తీబన్ నటిస్తుండగా, కేఎస్ రవికుమార్, నవాబ్‌షా, రాంకీ, కేజీఎఫ్ ఫేం అవినాష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో పవన్-హరీష్ కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అభిమానులు ఈసారి పవర్‌స్టార్ పూనకాలే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.