LOADING...
Kiara Advani: 'టాక్సిక్‌' తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్రకు కియారా సిద్ధం
'టాక్సిక్‌' తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్రకు కియారా సిద్ధం

Kiara Advani: 'టాక్సిక్‌' తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్రకు కియారా సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

'టాక్సిక్‌' సినిమాలో నదియా పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది అందాల తార కియారా అడ్వాణీ. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్న ఆమె, అదే సమయంలో మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. 'బరేలీ కీ బర్ఫీ', 'పంగా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు అశ్వినీ అయ్యర్‌ తివారీతో కియారా ఓ కొత్త ప్రాజెక్ట్‌ కోసం చేతులు కలిపిందని తెలుస్తోంది.

వివరాలు 

క్తిమంతమైన మహిళా ప్రాధాన్య కథగా..

ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉందని, ఇప్పటికే కథతో పాటు ఇతర అంశాలపై కియారా-దర్శకురాలి మధ్య పూర్తి స్థాయి చర్చలు జరిగాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని శక్తిమంతమైన మహిళా ప్రాధాన్య కథగా తీర్చిదిద్దనున్నారు. 'టాక్సిక్‌' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన అనంతరం ఈ కొత్త ప్రాజెక్ట్‌ చిత్రీకరణను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని కియారా సన్నిహితులు పేర్కొన్నారు.

Advertisement