LOADING...
TheRajaSaab : మిక్స్‌డ్ టాక్‌కూ తగ్గని దూకుడు… రాజాసాబ్ వీకెండ్ కలెక్షన్స్‌తో ప్రభాస్ స్టామినా
మిక్స్‌డ్ టాక్‌కూ తగ్గని దూకుడు… రాజాసాబ్ వీకెండ్ కలెక్షన్స్‌తో ప్రభాస్ స్టామినా

TheRajaSaab : మిక్స్‌డ్ టాక్‌కూ తగ్గని దూకుడు… రాజాసాబ్ వీకెండ్ కలెక్షన్స్‌తో ప్రభాస్ స్టామినా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
08:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాకు కొత్త దిశను చూపించిన స్టార్ ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమా చేయాలంటే కనీసంగా రూ. 500 కోట్ల బడ్జెట్ అవసరం అనే స్థాయికి మార్కెట్ చేరుకుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 100నుంచి రూ. 150కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. ప్రభాస్ సినిమా విడుదల అవుతుందంటే చాలు... పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థియేటర్ల వైపు పరుగులు పెడతారు. అలాంటి భారీ స్టార్‌డమ్ ఉన్న డార్లింగ్ ఈసారి వింటేజ్ టచ్‌తో కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'ది రాజాసాబ్'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందింది.

Details

 ఓవరాల్‌గా సినిమా మాత్రం సాలిడ్ స్టార్ట్ 

మైండ్ గేమ్ ఛాలెంజింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన రాజాసాబ్ ప్రస్తుతం థియేటర్లలో మంచి సందడి చేస్తోంది. నైజాం ప్రీమియర్స్ విషయంలో స్వల్పంగా దెబ్బ తగిలినప్పటికీ, ఓవరాల్‌గా సినిమా మాత్రం సాలిడ్ స్టార్ట్ నమోదు చేసింది. రాజాసాబ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దీంతో ప్రభాస్ కెరీర్‌లో వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన 6వ సినిమాగా రాజాసాబ్ రికార్డు సృష్టించింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 183 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నేటి నుంచి వరుస సెలవులు రావడంతో బుకింగ్స్‌లో మరింత జోరు కనిపిస్తోంది. ఈ రోజు ముగిసేలోగా రూ. 200కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

Advertisement