ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో కనబడని ఇద్దరు జడ్జిలు
తెలుగులో బాగా పేరుతెచ్చుకున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో, తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో పాటల పోటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తున్న ఈ కార్యక్రమం రెండవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రెండవ సీజన్ కి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయని సమాచారం. మరికొద్ది రోజుల్లో రెండవ సీజన్ ని అంగరంగ వైభవంగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐతే రెండవ సీజన్ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాజాగా షూటింగ్ సెట్లోంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో థమన్ మాత్రమే కనిపించడంతో మిగతా జడ్జిలు ఏమయ్యారనేది అందరికీ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి కొత్త జడ్జిలు వస్తున్నారా?
సీజన్ 1లో నిత్యామీనన్, కార్తీక్, థమన్ కలిసి జడ్జిలుగా ఉన్నారు. కానీ ప్రస్తుతం థమన్ ఒక్కడే సెట్లో కనిపించడంతో మిగతా జడ్జిలు ఉంటారా ఉండరా అన్న అనుమానం కలుగుతోంది. ఒకవేళ వాళ్ళుండకపోతే ఇంకెవరైనా కొత్తవాళ్ళు వస్తారా అన్న అనుమానమూ కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లేవు. ప్రోగ్రామ్ మొదలైతే గానీ అసలేం జరిగిందనేది తెలియదు. తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ లో బీవీకే వాగ్ధేవి ట్రోఫీ గెలుచుకుని విజేతగా నిలవగా, రెండవ స్థానంలో శ్రీనివాస్, మూడవ స్థానంలో వైష్ణవి నిలిచారు. ఇండియన్ ఐడల్ లో విజేతగా నిలిచిన శ్రీరామచంద్ర, తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ కి వ్యాఖ్యతగా వ్యవహరించారు. సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందో ఇంకా ప్రకటించలేదు.