AHA : 'ఆహా' రైటర్స్ టాలెంట్ హంట్ ప్రారంభం.. రచయితలకు కొత్త అవకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిభ గల రచయితలకు అవకాశాలు కల్పించేందుకు టాలెంట్ హంట్‌ను 'ఆహా' ఓటిటి ప్రకటించింది.
ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్ (మాస్ మూవీ మేకర్స్), దర్శకుడు సాయి రాజేశ్ (అమృత ప్రొడక్షన్స్) సహకారంతో ఈ టాలెంట్ హంట్‌ను చేపట్టారు.
ఈ కార్యక్రమం ద్వారా కొత్త రచయితలను వెలుగులోకి తేవాలనే దృఢ సంకల్పంతో ఉంది.
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ అల్లు అరవింద్ ఎప్పుడూ నూతన ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారని ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని పేర్కొన్నారు.
ఈ టాలెంట్ హంట్ ద్వారా అటువంటి ప్రతిభను ఇంకా విస్తృతంగా ప్రోత్సహిస్తామని, విజయవంతమైన స్క్రిప్టులకు సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
Details
విభిన్న రచనలు పంపే అవకాశాలు
వివిధ భాషల్లో వైవిధ్యమైన కథలు వస్తుండగా, తెలుగులో అలాంటి కథలు రాకపోవడంతో రచయితలకు తగిన గుర్తింపు లభించలేదని నిర్మాత ఎస్ కేఎన్ పేర్కొన్నారు.
ఈ టాలెంట్ హంట్ ద్వారా ప్రతిభావంతులైన రచయితలకు వేదిక అందించాలని ఆహా, అమృత ప్రొడక్షన్స్ తో కలిసి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ టాలెంట్ హంట్‌లో ఆసక్తి ఉన్న రచయితలు కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్, యాక్షన్ వంటి విభిన్న జానర్స్ లో తమ రచనలు పంపవచ్చని చెప్పారు.
మరిన్ని వివరాల కోసం ఆహా ఓటీటీ, ఆహా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను సందర్శించాలన్నారు.