Page Loader
Spirit : కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.. రఫ్ లుక్‎లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్
కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.. రఫ్ లుక్‎లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్

Spirit : కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.. రఫ్ లుక్‎లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ తన ప్రతి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆయన క్రేజ్ ఇప్పుడు భారతదేశాన్ని దాటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ దగ్గర ఉన్న స్టార్ లైనప్ మరే హీరోకు లేదు. ప్రత్యేకమైన కాంబినేషన్లు ఆయనను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక త్వరలో ప్రారంభమయ్యే ప్రభాస్ కొత్త సినిమా 'స్పిరిట్' కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు 

ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రభాస్ లుక్ క్రియేట్ 

తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించారు. పోలీస్ యూనిఫార్మ్‌లో సిగరెట్ తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఆ ఫొటో చూసిన అభిమానులు, "ఇదేనా 'స్పిరిట్'లో ఆయన లుక్?" అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఫొటోలో ప్రభాస్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ అటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తోంది, దాంతో అభిమానులు దీన్ని విస్తృతంగా పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు.