LOADING...
Srinivasa Mangapuram: కొత్త కథతో అజయ్ భూపతి రీ-ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' అనౌన్స్‌మెంట్!
కొత్త కథతో అజయ్ భూపతి రీ-ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' అనౌన్స్‌మెంట్!

Srinivasa Mangapuram: కొత్త కథతో అజయ్ భూపతి రీ-ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' అనౌన్స్‌మెంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ దర్శకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, మూడు సినిమాల కెరీర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి. తొలి చిత్రమైన ఆర్ఎక్స్ 100తో ఘన విజయాన్ని నమోదు చేసి అంచనాలు పెంచిన అజయ్, రెండో సినిమా మహాసముద్రంతో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఇటీవల విడుదలైన మంగళవారం మరోసారి అతడిని ఫామ్‌లోకి తీసుకురావడంతో పాటు మంచి హిట్‌గా నిలిచింది. అయితే మంగళవారం విడుదలై దాదాపు రెండేళ్లు అయినప్పటికీ, అతని తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి చాలా రోజుల తర్వాత తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాడు.

Details

 'శ్రీనివాస మంగాపురం' టైటిల్ ఫిక్స్

ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌ను పరిశీలిస్తే సినిమా లవ్ అండ్ మిస్టరీ నేపథ్యంతో ముందుకు సాగబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఆశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని కుటుంబ వారసుడైన 'జయకృష్ణ' హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. కథానాయికగా రషా తడాని నటిస్తోంది. అజయ్ భూపతి క్రియేటివిటితో పాటు కొత్త ముఖాల కలయిక ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.