Maidaan OTT: జూన్ 1 నుంచి , అమెజాన్ ప్రైమ్ లో మైదాన్.. హిట్ అవుతుందా
జయాపజయాలకు అతీతంగా మూడు, నాలుగు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అజయ్ దేవ్‌గణ్. అతడు హీరోగా ఇటీవల రిలీజైన హారర్ మూవీ సైతాన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన సినిమా 'మైదాన్'. అమిత్ శర్మ తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్నిమెప్పించినా..వసూళ్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. రహీమ్ గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.
ఫ్రీ స్ట్రీమింగ్ కాబట్టి చూడొచ్చు
అయితే ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ ఆడియెన్స్‌ను అలరించాయి. తాజాగా ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మైదాన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి రెంటల్ విధానంలో (రూ.349) మైదాన్ అందుబాటులోకి వచ్చింది. జూన్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అందరికి ఈ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ కీలక పాత్రలు పోషించారు. సయ్యద్ రహీమ్ పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటించాడు.
బాలీవుడ్ ఛాన్స్ మిస్సయిన మహానటి
మైదాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. ప్రియమణి పాత్ర కోసం ముందుగా కీర్తినే తీసుకున్నారు. అయితే రహీమ్ భార్య రోల్‌కు ఆమె సరిపోరనే ఆలోచనతో తప్పించారు. 1950 దశకంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా రహీమ్ (అజయ్ దేవ్‌గణ్) నియమితుడవుతాడు. కానీ ఫుట్‌బాట్ ఆటలో బెంగాల్ ఆధిపత్యం కావడంతో.. రహీమ్ కోచ్‌గా సెలెక్ట్ కావడం నచ్చని కొందరు బెంగాలీలు కుట్రలు పన్ని పదవి పోయేలా చేస్తారు. మళ్లీ కోచ్‌గా నియమితుడు కావడానికి రహీమ్‌కు ఎవరు సాయం చేశారు?, రహీమ్ మార్గదర్శనంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో ఎలా పతకం గెలిచింది అన్నదే ఈ సినిమా కథ.