Ajay Sastry : టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు మృతి
టాలీవుడ్‌లో మరో విషాధకరమైన ఘటన చోటు చేసుకుంది. 'నేను మీకు తెలుసా' డైరక్టర్ అజయ్ శాస్త్రి కన్నుముశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హీరో మంచు మనోజ్ తెలిపారు. ఆయన మరణం ఎంతో బాధించిందని, అజయ్ తో దిగిన ఓ ఫోటోను పంచుకున్నాడు. నా మిత్రుడు, అజయ్ శాస్త్రి ఇక లేరని వార్తను నమ్మలేకపోతున్నా, ఆయన కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నా అని తెలిపారు.
రైటర్ గా పనిచేసిన అజయ్ శాస్త్రి
చాలా త్వరగా వెళ్లిపోయావ్ అజయ్, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది కల అయితే బాగుండేది. ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో రాసుకచ్చారు. మనోజ్ నటించిన 'నేను మీకు తెలుసా' చిత్రం 2008లో రిలీజ్ అయి హిట్ గా నిలిచింది. దర్శకుడు కృష్ణవంశీ తీసిన 'రాఖీ', 'డేంజర్' చిత్రాలకు అజయ్ శాస్త్రి రైటర్ గా పనిచేశారు.