LOADING...
AK 64: 'ఏకే 64'గురించి మరో ఆసక్తికర అప్డేట్.. లారెన్స్‌, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?
లారెన్స్‌, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?

AK 64: 'ఏకే 64'గురించి మరో ఆసక్తికర అప్డేట్.. లారెన్స్‌, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'ఏకే 64'(AK 64)గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ కోసం గణనీయమైన బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజిత్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నారు.వారు విజయ్ సేతుపతి,రాఘవ లారెన్స్‌. అయితే వీరిద్దరూ ప్రతినాయకులుగా నటిస్తున్నారా? లేక అజిత్‌కు అండగా నిలిచే శక్తివంతమైన పాత్రల్లో వస్తారా?అన్నది చిత్రయూనిట్ ఇంకా వెల్లడించలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల మాటల ప్రకారం, వీరి రోల్స్ మల్టీ-డైమెన్షనల్‌గా ఉండనున్నాయని,కేవలం ప్రతినాయక పాత్రలుగా మాత్రమే కాకుండా కథలో ప్రధాన మలుపులకు కారణమవుతారని సమాచారం.

వివరాలు 

అజిత్‌ తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం

ఇటీవల 'వాలిమై', 'వీర్‌మా', 'తునివు', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అజిత్‌ ఈసారి మరింత స్టైలిష్‌, మాస్‌, అలాగే ఎమోషన్ కలగలిపిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నారని తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని అజిత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ సినిమాకి దేశంలోనే అగ్రశ్రేణి టెక్నీషియన్లు, యాక్షన్ మాస్టర్లు, డీఓపీ లు కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం అజిత్‌ తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

 'కాంచన 4' షూటింగ్‌లో రాఘవ లారెన్స్ బిజీ

ఇక రాఘవ లారెన్స్ ప్రస్తుతం 'కాంచన 4' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. మరోవైపు విజయ్ సేతుపతి బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో శరవేగంగా దూసుకెళ్తున్నారు. 'ఏకే 64' లో అజిత్‌, విజయ్ సేతుపతి‌, రాఘవ లారెన్స్ ఒకే తెరపై కనిపిస్తే.. అది కేవలం కోలీవుడ్‌కే కాదు, పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ, క్రేజీ కాంబినేషన్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement