Page Loader
Ajith Kumar: అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక 
అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక

Ajith Kumar: అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కాలి భాగంలో స్వల్పంగా గాయమైనట్లు తెలిసింది.అయితే ఇది పెద్దగా ఆందోళనకరం కాదని, ప్రమాదానికి గురికాలేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆయనను ఈ సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశమున్నట్లు అజిత్ టీమ్ జాతీయ మీడియాకు తెలియజేసింది. నటుడి ఆరోగ్యంపై అభిమానులు కలత చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన తర్వాత,అజిత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే పెద్దసంఖ్యలో అభిమానులు ఆయనను చూసేందుకు ఎయిర్‌పోర్టులో గుమికూడటంతో అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో అజిత్ కాలికి స్వల్పంగా గాయమైందని ఆయన టీమ్ వివరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స కోలీవుడ్ హీరో