LOADING...
Akhanda 2: నంద‌మూరి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. 3Dలో అఖండ 2
నంద‌మూరి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. 3Dలో అఖండ 2

Akhanda 2: నంద‌మూరి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. 3Dలో అఖండ 2

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'అఖండ 2' (Akhanda 2)పై తాజా అప్‌డేట్‌ను చిత్ర బృందం బయటపెట్టింది. ఇటీవల జరిగిన 'అఖండ 2' బిగ్ రివీల్ ప్రెస్ మీట్‌లో నిర్మాతలు మాట్లాడుతూ... ఈ సీక్వెల్‌ను కేవలం 2డీకి మాత్రమే కాకుండా 3డీ ఫార్మాట్‌లో (Akhanda 2 in 3D) కూడానూ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారతీయ సినిమా ప్రపంచంలో విభిన్న అనుభూతిని అందించే చిత్రాల్లో 'అఖండ 2' ప్రత్యేకంగా నిలుస్తుందని టీమ్ చెప్తోంది. 3డీలో ఈ సినిమాను వీక్షించడం ప్రేక్షకులకు కొత్తగా, మరింత ప్రభావవంతమైన అనుభవాన్ని ఇస్తుందని యూనిట్ నమ్ముతోంది.

వివరాలు 

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ముఖ్యంగా బోయపాటి స్టైల్‌లో ఉండే భారీ యాక్షన్ సన్నివేశాలు 3డీ టెక్నాలజీతో మరింత అద్భుతంగా కనిపిస్తాయని అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గతంలో సంచలనం సృష్టించిన 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్