LOADING...
Akhanda 2: మోకాలి గాయంతోనూ ఆగని డ్యాన్స్.. ఫిజియోథెర‌పీ చేయించుకొని మ‌రీ.. సంయుక్త చెప్పిన అఖండ 2 విశేషాలు
సంయుక్త చెప్పిన అఖండ 2 విశేషాలు

Akhanda 2: మోకాలి గాయంతోనూ ఆగని డ్యాన్స్.. ఫిజియోథెర‌పీ చేయించుకొని మ‌రీ.. సంయుక్త చెప్పిన అఖండ 2 విశేషాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2: తాండవం' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. విడుదలకు ముందు చిత్ర బృందం మీడియాతో ముచ్చటించగా, ఆ సందర్భంగా కథానాయిక సంయుక్త మీనన్ తన పాత్రతో పాటు షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తాను ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, అవకాశం చాలా ప్రత్యేకంగా అనిపించడంతో డేట్స్ సర్దుబాటు చేసి ఈ సినిమాలో భాగమయ్యానని సంయుక్త తెలిపారు. 'అఖండ 2' కథలో కీలక మలుపు తిప్పే ముఖ్యమైన పాత్ర నాకే దక్కింది.

వివరాలు 

గూస్‌బంప్స్ పక్కా..

సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ గూస్‌బంప్స్ తెప్పించేదిగా ఉంటుంది అని ఆమె ధీమాగా చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను గొప్ప విజన్‌తో పని చేస్తారని, తెరపై కనిపించే విజువల్స్ చూడముచ్చటగా ఉంటాయని సంయుక్త కొనియాడారు. ఈ సినిమాలో తన పాత్రను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారని, ముఖ్యంగా ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటుందని వెల్లడించారు. తన కెరీర్‌లో తొలిసారి మాస్ పాటకు స్టెప్పులు వేశానని గుర్తు చేసుకుంటూ, డ్యాన్స్ చేస్తున్న సమయంలో మోకాలు గాయపడినప్పటికీ, షూటింగ్ నిలిపివేయకుండా పిజియోథెరపీ తీసుకుంటూనే సాంగ్‌ను పూర్తి చేశానని చెప్పారు.

వివరాలు 

మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడని నిర్మాత 

బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, షూటింగ్ సెట్లో ఆయన ఎంతో స్నేహభావంతో మెలుగుతారని, దర్శకుల విషయంలో ఆయన డిసిప్లిన్‌తో కూడిన పరిపూర్ణ నటుడిగా కనిపిస్తారని అన్నారు. కాగా, 'డాకూ మహరాజ్' తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని కూడా పేర్కొన్నారు. తమన్ స్వరపరిచిన సంగీతం, ముఖ్యంగా సంస్కృత శ్లోకాలతో మేళవించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత హైలైట్ చేస్తుందని సంయుక్త అభిప్రాయపడ్డారు. నిర్మాతలు రామ్, గోపీ ఆచంట సినిమా నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా ఎంతో శ్రద్ధ పెట్టారని, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను 'స్వయంచు', 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నానని సంయుక్త పేర్కొన్నారు.

Advertisement