LOADING...
Akhand 2: అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్.. కాశీలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య-బోయపాటి
అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్.. కాశీలో ప్రత్యే

Akhand 2: అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్.. కాశీలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య-బోయపాటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ 2' బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. సినిమా విజయానికి కృతజ్ఞతగా చిత్ర బృందం వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరూ సంప్రదాయ పట్టు వస్త్రాల్లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్‌ చేస్తున్నారు.

Details

ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన

డిసెంబర్‌ 12న విడుదలైన 'అఖండ 2'కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. హిందుత్వం, ఆధ్యాత్మికత నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్‌ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు.

Advertisement