LOADING...
Akhanda 2: 'అఖండ 2.. తాండవం' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..
'అఖండ 2.. తాండవం' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

Akhanda 2: 'అఖండ 2.. తాండవం' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా 'అఖండ 2: తాండవం' విడుదల తేది ఖరారు అయింది. అభిమానులు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ ద్వారా రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు, అలాగే ఎం. తేజస్విని నందమూరి దీనిని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టించింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను కథను మరింత కొత్తగా తెరకెక్కించారని సమాచారం.

వివరాలు 

కాషాయ రంగు వస్త్రాలు ధరించిన బాలకృష్ణ 

ఇక దసరా పండుగను పునస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ లో విడుదల తేదీ, అలాగే పోస్టర్‌లో పోస్టర్‌లో బాలకృష్ణ పొడవాటి జుట్టు, గడ్డం, మెడలో రుద్రాక్షలతో గంభీరంగా నిలిచి ఉన్నారు. అలాగే చేతిలో భారీ త్రిశూలం పట్టుకుని, కాషాయ రంగు వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన వెనుకనున్న మంచు వాతావరణం, పోస్టర్‌లోని డైనమిక్ పోజ్ బాలకృష్ణ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నారు. బాలకృష్ణ అంటే చాలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై-వోల్టేజ్ తో మరింత పవర్‌ఫుల్ గా మారుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్