LOADING...
Akhanda 2 : 'అఖండ 2: తాండవం' ఫుల్‌ సాంగ్‌ నవంబర్‌ 9 రిలీజ్‌.. థమన్ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌ 
థమన్ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్

Akhanda 2 : 'అఖండ 2: తాండవం' ఫుల్‌ సాంగ్‌ నవంబర్‌ 9 రిలీజ్‌.. థమన్ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటే మాస్‌ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎమోషన్‌. ఈ జంట నుంచి వచ్చే ప్రతి సినిమా ఎనర్జీ, యాక్షన్‌, ఎమోషన్‌ల మేళవింపుతో భారీ ఆశలు రేకెత్తిస్తుంది. దీంతో ఈ కాంబోలో వస్తున్న కొత్త చిత్రం "అఖండ 2: తాండవం" పై అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. ప్రత్యేకంగా మొదటి భాగం అఖండ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత, సీక్వెల్‌ పట్ల ప్రేక్షకుల నమ్మకం, అంచనాలు మరింత పెరిగాయి.Embed

వివరాలు 

 పాట పూర్తి వర్షన్‌ విడుదల తేదీ ఫిక్స్‌ 

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అనౌన్స్‌మెంట్‌ తాజాగా బయటికొచ్చింది. మాస్‌ బీట్‌లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే "తాండవం" సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ నవంబర్‌ 7న రిలీజ్‌ చేయబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్‌ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వర్షన్‌ విడుదల తేదీ కూడా ఫిక్స్‌ అయిపోయింది. సంగీత దర్శకుడు థమన్‌ తన సోషల్‌ మీడియా ద్వారా "అఖండ 2 - తాండవం ఫుల్‌ సాంగ్‌ నవంబర్‌ 9న వస్తోంది!" అని స్పష్టం చేశారు. ఈ అప్‌డేట్‌ వెంటనే బాలయ్య అభిమానులు సోషల్‌ మీడియాలో సెలబ్రేషన్‌ ప్రారంభించారు.

వివరాలు 

బాలయ్య పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, థమన్‌ ఉర్రూతలూగించే బీట్

థమన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటలో బాలకృష్ణ ఎనర్జీ, బోయపాటి ట్రీట్‌ రెండూ కలిసే ఉంటాయని యూనిట్‌ చెబుతోంది ముఖ్యంగా ఈసారి "తాండవం" సాంగ్‌, మొదటి భాగంలో వైరల్‌ అయిన "జై బాలయ్య" పాటకు సమానమైన మాస్‌ వైబ్‌ను అందించబోతుందని సమాచారం. బాలయ్య పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, థమన్‌ ఉర్రూతలూగించే బీట్‌లు కలిసి తెరపై వేడి పెంచనున్నాయనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ని 14 రీల్‌ ప్లస్‌ ఎంటర్టైన్‌మెంట్ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో సంయుక్తా,హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ విజువల్స్‌, మిస్టరీ వాతావరణం, బోయపాటి మార్క్‌ మాస్‌ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సీక్వెల్‌ మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని టీమ్‌ చెబుతోంది.

Advertisement

వివరాలు 

ఈసారి బాలయ్య ఎలాంటి 'తాండవం' చూపిస్తారు?

సినిమా విడుదల విషయానికి వస్తే.."అఖండ 2: తాండవం" డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ముఖ్యంగా అభిమానుల ప్రశ్న ఒక్కటే.. ఈసారి బాలయ్య ఎలాంటి 'తాండవం' చూపిస్తారు? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 థమన్‌ చేసిన ట్వీట్ 

Advertisement