LOADING...
Akhanda 2 Thandavam:  యూఎస్‌ఏలో హాట్ కేక్ లా అమ్ముడవుతున్న అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్
యూఎస్‌ఏలో హాట్ కేక్ లా అమ్ముడవుతున్న అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్

Akhanda 2 Thandavam:  యూఎస్‌ఏలో హాట్ కేక్ లా అమ్ముడవుతున్న అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత వారం ఈ సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, ఆ అనూహ్య పరిణామం సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచిందని చెప్పాలి. ముఖ్యంగా USA వంటి విదేశీ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయి. యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు హాట్‌కేక్ లా అమ్ముడవుతున్నాయి.

వివరాలు 

డిసెంబర్ 11 రాత్రే యూఎస్‌ఏలో ప్రీమియర్ షోలు ప్రారంభం

ప్రధాన నగరాల్లో టికెట్ల విక్రయం రికార్డు స్థాయిలో జరుగుతుంది. తాజా సమాచారాల ప్రకారం,కేవలం ఆరు గంటల్లోనే ప్రీ-సేల్స్ ద్వారా సుమారు $125,000(సుమారు 1 కోట్ల రూపాయల పైగా) ఆదాయం నమోదు చేసి,తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన సినిమా 'అఖండ 2'గా నిలిచింది. ఈ రికార్డు, బాలకృష్ణ క్రేజ్ ఎంత పెద్దదో అద్దమిస్తోందని చెప్పాలి. ప్రీమియర్ షోల కోసం ప్రవేశపెట్టిన $16 కొత్త టికెట్ ధర వ్యూహం ఆశించినంత ప్రభావాన్ని చూపింది. అభిమానులు, సినిమా ప్రేమికులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని, తమ ఫేవరెట్ హీరో సినిమా ముందుగానే చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, డిసెంబర్ 11 రాత్రే యూఎస్‌ఏలో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

వివరాలు 

విలన్ పాత్రలో ఆది పినిశెట్టి

డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా, ఆర్థిక, న్యాయపరమైన వివాదాల కారణంగా చివరి క్షణంలో వాయిదా పడింది. అయితే, ఈ అనూహ్య గందరగోళం సినిమాకు అదనపు ప్రచారం తీసుకువచ్చింది, బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని శిఖరానికి చేరుస్తోంది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అఖండ రుద్ర సికిందర్ అఘోర, మురళీకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ₹200 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే, సాశ్వత ఛటర్జీ, పూర్ణ, హర్షాలీ మల్హోత్రా (బజరంగీ భాయిజాన్ ఫేమ్) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

వివరాలు 

2D, 3D ఫార్మాట్లలో సినిమా 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ ఆచంట, గోపి ఆచంట నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంగీతం ఎస్.ఎస్. థమన్ అందించారు. సినిమా 2D, 3D ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో #Akhanda2Thandavam హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉండగా, డిసెంబర్ 12న బాలయ్య బాబు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తాండవం సృష్టిస్తాడో చూడాలి.

Advertisement