LOADING...
Akhanda2 : 'అఖండ 2' థియేట్రికల్ రైట్స్ హవా.. బాలయ్య కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బెస్ట్ డీల్!
'అఖండ 2' థియేట్రికల్ రైట్స్ హవా.. బాలయ్య కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బెస్ట్ డీల్!

Akhanda2 : 'అఖండ 2' థియేట్రికల్ రైట్స్ హవా.. బాలయ్య కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బెస్ట్ డీల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ-2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన అఖండ 2 ఫస్ట్ గ్లింప్స్ సెన్సేషన్ సృష్టించడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, 'అఖండ-2' రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. ప్రాంతాల వారీగా అమ్ముడైన రేట్లు ఇలా ఉన్నాయి:

Details

నైజాం రైట్స్‌ కోసం దిల్ రాజు ముందంజ

* ఉత్తరాంధ్ర - ₹13.50 కోట్లు (గాయత్రీ దేవి ఫిల్మ్స్ - సతీష్) గుంటూరు - ₹9.50 కోట్లు (రాధాకృష్ణ ఎంటర్‌టైన్మెంట్స్) ఈస్ట్ గోదావరి - ₹8.25 కోట్లు (విజయలక్ష్మి సినిమాస్) కృష్ణా - ₹7 కోట్లు (నాని వెంకట్) వెస్ట్ గోదావరి - ₹6.5 కోట్లు నెల్లూరు - ₹4.4 కోట్లు (కావలి భరత్) సీడెడ్ - ₹24 కోట్లు (శోభన్) నైజాం రైట్స్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందంజలో ఉన్నారని సమాచారం. అయితే నిర్మాతలు ఈ ఎరియాకు రూ.30 కోట్లు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ బిజినెస్‌తో 'అఖండ-2' విడుదలకు ముందే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.