Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ.. 'అఖండ 2' రిలీజ్ వాయిదా.. ప్రకటించిన నిర్మాణ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన భారీ అంచనాల చిత్రం 'అఖండ 2' విడుదల వాయిదా పడింది. గత కొన్ని గంటలుగా ఈ సినిమా విడుదల విషయంపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించి సమస్యలు ఎదురయ్యాయని వార్తలు వినిపించగా, గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేయడం ఆ సందేహాలకు మరింత ఆధారంగా మారింది. ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కావాల్సిఉంది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
వివరాలు
వాయిదా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు
''అనివార్య కారణాల వల్ల 'అఖండ 2' నిర్ణయించిన సమయానికి విడుదల కావడం లేదు. ఈ పరిస్థితే ప్రస్తుతం మాకు తీవ్ర వేదనను కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రతి అభిమాని, సినీ ప్రేక్షకుడు ఎదుర్కొనే నిరాశను మేం పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ వాయిదా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ సమయంలో మీ మద్దతు మాకు ఎంతో అవసరం. త్వరలోనే సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం'' అని సంస్థ పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…