ఏజెంట్ మూవీ బడ్జెట్: అఖిల్ సినిమాకు హిట్ సరిపోదు, బ్లాక్ బస్టర్ కావాలి?
అక్కినేని అఖిల్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. వరుసగా ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న తర్వాత, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాతో మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది, కానీ కారణమేంటో తెలియదు గానీ రిలీజ్ ఆలస్యం అవుతోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఐతే ఈ సినిమా బడ్జెట్ గురించి ఒక వార్త ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని అంటున్నారు. అఖిల్ మార్కెట్ తో పోలిస్తే ఎక్కువ డబ్బుతో సినిమాను తెరకెక్కించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అఖిల్ సినిమా ఖచ్చితంగా విజయవంతమవ్వాల్సిందే అని చెప్పుకుంటున్నారు.
80కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిందంటూ వార్తలు
ఏజెంట్ మూవీకి సుమారుగా 80కోట్ల దాకా డబ్బులు పెట్టి ఉంటారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఏజెంట్ మూవీకి హిట్ దొరికితే చాలదు, బ్లాక్ బస్టర్ దొరకాలని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో ఏజెంట్ మూవీ రిలీజ్ అవుతోంది. మరి పాన్ ఇండియా రేంజ్ లో అఖిల్ సినిమాకు ఆదరణ దక్కుతుందా లేదా తెలియాలంటే ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆగాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్యనాథ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ప్రధాన పాత్రలో మమ్ముట్టి చేస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్నారు.