మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కినేని అఖిల్ ని కొత్తగా చూపించిన ఏజెంట్ చిత్రం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. సినిమాకు పూర్తిగా నెగెటివ్ టాక్ రావడంలో కలెక్షన్లు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటూ ఆరాలు మొదలయ్యాయి. తాజాగా ఏజెంట్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఏజెంట్ సినిమాను ఓటీటీలో చూడవచ్చని తెలుస్తోంది. రీసెంట్ గా రివీలైన సమాచారం ప్రకారం, మే 19వ తేదీ నుండి సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ లో ఏజెంట్ మూవీ అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. అంటే, సినిమా రిలీజైన మూడు వారాలకే ఓటీటీలోకి ఏజెంట్ వచ్చేస్తోందన్నమాట.
ఏజెంట్ కోసం కష్టపడ్డ అఖిల్
ఇంత తక్కువ టైమ్ లో ఇంత పెద్ద బడ్జెట్ సినిమా, ఓటీటీలోకి వచ్చేస్తుండడం కొంచెం విచిత్రమే. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన శరీరాన్ని చాలా మార్చుకున్నాడు. అయినా కూడా కథలో కొత్తదనం లేకపోవడంతో ఏజెంట్ సినిమా చతికిలపడింది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో మమ్ముట్టి కనిపించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సరెండర్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఏజెంట్ తర్వాత అక్కినేని అఖిల్, తన కొత్త చిత్రాన్ని కొత్త దర్శకుడితో మొదలెట్టనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుందని అంటున్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి