తెలుగులో రెండవ సినిమా చేసేందుకు రెడీ కాబోతున్న జాన్వీ కపూర్, ఈసారి అక్కినేని వారసుడితో రొమాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం తెలుగులో తన రెండవ సినిమాకు సంతకం చేసింది జాన్వీ కపూర్. అక్కినేని వారసుడు అఖిల్ తో జాన్వీ కపూర్ రెండవ తెలుగు సినిమా ఉండబోతుందని అంటున్నారు.
ఏజెంట్ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి అఖిల్ తన తర్వాత సినిమాను, కొత్త దర్శకుడితో మొదలెట్టడానికి సిద్ధమవుతున్నారు.
సాహో చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అఖిల్ రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
Details
కోడై కూస్తున్న సోషల్ మీడియా
ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30లో నటిస్తున్న జాన్వీ కపూర్ ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అఖిల్ తో నటించబోయే సినిమాకు కూడా అంతే పారితోషికం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అదలా ఉంచితే, అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ కారణంగా అఖిల్ కెరీర్ లో మరో ఫ్లాప్ చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.