LOADING...
Samantha - Akhil: సమంతకు అభినందనలు తెలిపిన అఖిల్
సమంతకు అభినందనలు తెలిపిన అఖిల్

Samantha - Akhil: సమంతకు అభినందనలు తెలిపిన అఖిల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కొత్త చిత్రం 'లెనిన్' ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇటీవల ఘన విజయాన్ని సాధించిన 'మా ఇంటి బంగారం' చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ఆయన ప్రశంసించారు. అఖిల్ మాట్లాడుతూ, "ప్రస్తుతం 'లెనిన్' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటంతో 'మా ఇంటి బంగారం' సినిమాను ఇంకా చూడలేకపోయాను. అయితే ట్రైలర్ మాత్రం చూసాను. అది నాకు ఎంతో ఆకట్టుకుంది.

వివరాలు

మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అఖిల్..

సినిమా మొత్తం ఒక మంచి ఫీల్‌ను కలిగించింది. విడుదలకు ముందే ఇది విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం కలిగింది. కథనం చాలా సహజంగా అనిపించింది. ఒక మంచి కోడలిగా కుటుంబ సభ్యులందరి మనసులు గెలుచుకోవాలనే భావోద్వేగ అంశాన్ని, శక్తివంతమైన యాక్షన్‌తో మేళవించడం ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా మహిళా ప్రధాన పాత్రతో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలను రూపొందించడం ప్రశంసనీయమైన విషయం. సమంత తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించిన మొత్తం చిత్రబృందానికి కూడా శుభాకాంక్షలు" అని తెలిపారు.

వివరాలు

జూన్ నెల తనకు ప్రత్యేకమని చెప్పిన సమంత..

మరోవైపు నటి సమంతకు జూన్ నెల ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందని ఆమె వెల్లడించారు. "అద్భుతమైన కథ" అనే క్యాప్షన్‌తో జూన్ నెలకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ నెలలోనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా సినిమా టికెట్ విక్రయాలకు సంబంధించిన చిత్రాలతో పాటు, గర్భధారణ సమయంలో తాను చేసిన వర్కౌట్ల వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement