
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున 100వ సినిమా.. 'లాటరీ కింగ్'పై భారీ అంచనాలు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో రోల్స్ నుంచి విలన్ రోల్స్‌కు మారుతూ ప్రేక్షకులను షాక్ ఇచ్చుతున్నారు. కుబేర, కూలీ చిత్రాల్లో నెగటివ్ టచ్ ఇచ్చిన నాగ్, తన తదుపరి 100వ సినిమా కోసం హీరోగా యూటర్న్ తీసుకోవడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తీక్‌తో సినిమా చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.దసరా సీజన్‌లో షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల అది సక్రమంగా జరగలేదు. నాగ్, ఈ మైల్‌స్టోన్ మూవీని మరింత గుర్తుండిపోయేలా రూపొందించేందుకు స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని సమాచారం. తాజా టాలీవుడ్ సర్కిల్ బజ్ ప్రకారం, సన్స్ చైతూ, అఖిల్ వంటి నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో యాడ్ కావనున్నారని టాక్ వినిపిస్తోంది.
Details
పూజ కార్యక్రమాలతో షూట్ ప్రారంభం
ఈ సినిమాకు ఫిక్స్ చేయదలచిన టైటిల్ 'లాటరీ కింగ్' అని తెలిసింది, ఎందుకంటే ఫ్యాన్స్ నాగార్జునను ముద్దుగా 'కింగ్' అని పిలుస్తారు. ఈ నెలలోనే పూజ కార్యక్రమాలతో షూట్ ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ప్యూర్ అవుట్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అన్నపూర్ణ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న 'లాటరీ కింగ్'లో నాగ్ ముగ్గురు హీరోయిన్స్‌తో రోమాన్స్ చేస్తారని సమాచారం. తన కెరీర్‌లో 100వ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.