Akshay Kumar: అక్షయ్ కుమార్ కాన్వాయ్ కారుకు యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్‌కు చెందిన ఎస్కార్ట్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకోగా, ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదం అక్షయ్ కుమార్ నివాసానికి సమీపంలోని జూహు ప్రాంతం వద్ద జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం వేగంగా వచ్చిన కారును ఓ ఆటోరిక్షా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాత్రి సుమారు 9 గంటల సమయంలో జరిగింది. ప్రమాదం జరిగిన ఎస్కార్ట్ కారులో అక్షయ్ కుమార్ లేరు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించారు.
Details
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు
ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఎస్కార్ట్ కారు రోడ్డుపై ఒరిగిపోయి ఉండటం, అధికారులు సహాయక చర్యలు చేపట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కొన్ని కథనాల ప్రకారం అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో హీరో వేరే వాహనంలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.