LOADING...
Alia Bhatt Birthday: అలియా భట్ బర్త్‌డే స్పెషల్.. త‌ప్ప‌క చూడాల్సిన ఐదు సినిమాలివే!
అలియా భట్ బర్త్‌డే స్పెషల్.. త‌ప్ప‌క చూడాల్సిన ఐదు సినిమాలివే!

Alia Bhatt Birthday: అలియా భట్ బర్త్‌డే స్పెషల్.. త‌ప్ప‌క చూడాల్సిన ఐదు సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అందం, అభినయం కలగలిపిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నేడు తన పుట్టినరోజు (మార్చి 15) జరుపుకుంటోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటి తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా RRR సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ సందర్భంగా అలియా భట్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్-5 సినిమాలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం

Details

1. గంగూబాయి కతియావాడి

అలియా భట్ సినీ కెరీర్ గురించి చెప్పుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో గంగూబాయి పాత్రలో అలియా అద్భుతంగా నటించింది. బ్రోతల్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ శక్తివంతమైన మహిళగా ఎలా ఎదిగిందో ఈ సినిమాలో చూపించారు. 2022లో విడుదలైన ఈ చిత్రంలో నటనకు గాను అలియా భట్ జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.

Details

2. రాజీ

దేశభక్తి నేపథ్యంలో రూపొందిన స్పై థ్రిల్లర్ చిత్రం 'రాజీ'. ఇందులో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించింది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో గూఢచారిగా పాకిస్థాన్‌కు వెళ్లే కశ్మీరి యువతిగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని Amazon Prime Video మరియు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

Advertisement

Details

3. హైవే

2014లో విడుదలైన 'హైవే' సినిమాలో కూడా అలియా భట్ తన నటనతో మెప్పించింది. పెళ్లికి ముందు కిడ్నాప్‌కు గురైన యువతిగా ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. కిడ్నాపర్‌తో ఏర్పడే భావోద్వేగ సంబంధం, స్వేచ్ఛపై ఆమె దృక్పథం ఈ చిత్రానికి ప్రత్యేకతగా నిలుస్తాయి. ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Details

4. డియ‌ర్‌ జిందగీ

మెంటల్ హెల్త్ ప్రాధాన్యతను తెలియజేసే చిత్రం 'డియర్ జిందగీ'. ఇందులో కైరా అనే సినిమాటోగ్రాఫర్ పాత్రలో అలియా నటించింది. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, భావోద్వేగ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016లో విడుదలైన ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.

Details

5. ఆర్ఆర్ఆర్

తెలుగు ప్రేక్షకులకు అలియా భట్‌ను మరింత దగ్గర చేసిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం లో రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇందులో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రలో అలియా కనిపించింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం జీ5, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అలియా భట్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యప‌రుస్తోంది. నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఈ స్టార్ భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement