Loading...
Allari Naresh: మళ్లీ తన మార్క్ కామెడీతో వస్తున్న అల్లరి నరేశ్.. 'రంభ ఊర్వశి మేనక' నుంచి కొత్త పాట

Allari Naresh: మళ్లీ తన మార్క్ కామెడీతో వస్తున్న అల్లరి నరేశ్.. 'రంభ ఊర్వశి మేనక' నుంచి కొత్త పాట

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో అల్లరి నరేశ్.. చాలా కాలం తర్వాత మళ్లీ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురువారం సినిమా నుంచి రెండో పాట 'బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా'ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చంద్రమోహన్ చింతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాట వినసొంపుగా ఉండటంతో పాటు.. సినిమా కథా నేపథ్యాన్ని కూడా తెలియజేసేలా ఉంది.

వివరాలు

ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ..

ముఖ్యంగా 'వెళ్లవే పేదరికం.. ఇక్కడే ఇల్లరికం' వంటి లైన్లు సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.

పేదరికం, కుటుంబ సమస్యల చుట్టూ అల్లరి నరేశ్ మార్క్ కామెడీ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా ఓ హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా 'నాంది', 'ఉగ్రం' వంటి సీరియస్, ఇంటెన్స్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అల్లరి నరేశ్.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్‌తో నవ్వించేందుకు సిద్ధమయ్యారు.

ఈ చిత్రంలో ఆయనకు జోడీగా సురభి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వీరిద్దరి మధ్య ఉండే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధం..

'రంభ ఊర్వశి మేనక' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

అల్లరి నరేశ్ పాత కామెడీ టైమింగ్‌ను అభిమానులు మరోసారి ఎంజాయ్ చేయనున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT