అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్రాండ్: ఈ కామర్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పాపులర్ అయిపోయారు. కనీసం చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా హిందీలో 100కోట్లకు పైగా కలెక్షన్లను పుష్ప సాధించింది. దీంతో అల్లు అర్జున్ పేరు ఇండియా లెవెల్ లో మారుమోగిపోయింది. ఈ క్రమంలో పలు కంపెనీలు అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తమ ప్రోడక్టులకు ఎంచుకున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్, అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఫ్లిప్ కార్ట్ గురించి ఒకానొక కమర్షియల్ యాడ్ లో అల్లు అర్జున్ నటించారని సమాచారం.
మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్న యాడ్
రెండు రోజులపాటు ఈ యాడ్ షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ యాడ్ బయటకు వస్తుందని అంటున్నారు. అదలా ఉంచితే, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటన వచ్చింది. రీసెంట్ గా జవాన్ సినిమాతో అద్భుతం సృష్టించిన అట్లీతోనూ అల్లు అర్జున్ సినిమా ఉండనుందని అంటున్నారు.