
అల్లు అర్జున్ బర్త్ డే: సినిమా ఫెయిలైనా అల్లు అర్జున్ ఫెయిల్ కాని అద్భుతమైన సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఆ తర్వాత ఆర్యతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ని చూసి, ఇతను గంగోత్రిలో నటించిన హీరోనేనా అని షాకయ్యారు.
సినిమా సినిమాకు తన లుక్ లో వేరియేషన్స్ చూపిస్తుంటాడు అల్లు అర్జున్. తన లుక్ ని బట్టి అదేం సినిమానో చెప్పేయవచ్చంటే, లుక్ పట్ల తనెంత కేర్ తీసుకునేవాడో అర్థం చేసుకోవచ్చు.
ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కెరీర్లోని అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా బాక్సాఫీసు దగ్గర అంతగా ప్రభావం చెందని సినిమాల్లో, తను పడిన కష్టం గురించి చెప్పుకుందాం.
అల్లు అర్జున్
సినిమా ఫెయిలైనా అల్లు అర్జున్ ఫెయిల్ కాని సినిమాలు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా:
ఈ సినిమాలో ఆర్మీ జవాన్ పాత్రలో అల్లు అర్జున్ పూర్తిగా మునిగిపోయారు. యాక్షన్ సీక్వెన్సెస్ లో అల్లు అర్జున్ వేరే లెవెల్లో కనిపిస్తాడు. సినిమా ఆడకపోయినా పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
బద్రినాథ్:
ఈ సినిమాకు థియేటర్లలో చెప్పుకోదగినంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఇందులో అల్లు అర్జున్ నటన, అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇద్దరమ్మాయిలతో:
దేశముదురు తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసిన రెండో సినిమా ఇది. ఇందులోని ఫైట్ సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
హ్యాపీ:
అల్లు అర్జున్ లోని కామెడీ టైమింగ్ ని పరిచయం చేసిన చిత్రమిది. సినిమా మొత్తం చాలా హాయిగా సాగిపోతుంది. ఇందులో హీరోయిన్ గా జెనీలియా కనిపించింది.