Page Loader
రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బంగారు పలక చేయించిన అల్లు అర్జున్? 
క్లీం కారకు ఖరీదైన బహుమతి అల్లు అర్జున్ ఇచ్చారని వార్తలు

రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బంగారు పలక చేయించిన అల్లు అర్జున్? 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 02, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాప పుట్టిన నెల తర్వాత ప్రత్యేకమైన వీడియోను రామ్ చరణ్, ఉపాసన విడుదల చేసారు. పాప పుట్టినప్పటి నుండి బహుమతుల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బంగారు ఊయలను బహుమతిగా ఇచ్చాడని పుకార్లు వచ్చాయి. అలాగే రామ్ చరణ్ స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లీం కారకు బహుమతిగా బంగారంతో డిజైన్ చేసిన డాలర్ నాణేలను బహుమతిగా ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఖరీదైన బహుమతిని అందించారని అంటున్నారు.

Details

బంగారు పలకపై క్లీం కార వివరాలు 

రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం మామ అల్లు అర్జున్, బంగారు పలకను బహుమతిగా అందించాడని వార్తలు వస్తున్నాయి. ఆ పలక మీద క్లీం కార పుట్టినతేదీ, అలాగే లలిత సహస్ర నామం నుండి పేరును ఎలా తీసుకున్నదీ సహా అన్ని వివరాలు ఉన్నాయట. ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమచారం బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఇది నిజామా కాదా అనేది ఎవరైనా స్పందిస్తేనే అర్థమవుతుంది. అదలా ఉంచితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో హీరోగా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.