
AA 22: అల్లు అర్జున్ 'AA22' షూటింగ్‌లో ఫుల్ మోడ్.. జపనీస్ కొరియోగ్రాఫర్ ఫొటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'AA22'పై తాజా అప్‌డేట్ అందింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. తాజాగా జపాన్‌లోని ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ హోక్ ఈ సినిమాకు సంబంధించిన బీహైండ్ ద సీన్ (BTS) ఫొటోలను షేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుందనేది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. భారతీయ సినిమాకు పని చేయాలని ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. AA22 కోసం ఒక నెల పాటు కష్టపడ్డాం. టీమ్ మొత్తం దీని కోసం ఎంతో శ్రమించింది.
Details
సినిమాపై భారీ అంచనాలు
ఇది భారీ స్థాయిలో విడుదలకానుంది. ఇంతకుమించి విషయాలను ఇక్కడ చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. అభిమానులు ఈ సినిమాలో అల్లు అర్జున్ మరో హుక్ స్టెప్‌తో అదరగొట్టబోతున్నారని ఊహిస్తున్నారు. ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్ట్‌పై ఆధారపడిన సైన్స్‌ఫిక్షన్ ఫ్లిక్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ పాత్ర మూడు భిన్న కోణాల్లో కనిపించనుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఇంటర్నేషనల్ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు కథానాయికలు ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రంలో, దీపికా పదుకొణె పేరు ఇప్పటికే ఖరారైపోవడం విశేషం. AA22 కోసం పూర్తి టీమ్ కృషి చేస్తున్న కారణంగా, సినిమాపై అభిమానుల్లో జోష్ గరిష్టంగా పెరిగింది.