
తెలుగు ఇండియన్ ఐడల్ కోసం అల్లు అర్జున్: పెద్దరికం వల్ల ఆగిపోయానంటున్న ఐకాన్ స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ పాటల పోటీ ప్రోగ్రామ్ విజయవంతంగా సాగుతోంది. వారం వారం సరికొత్త పాటలతో అలరిస్తూ వస్తోంది.
తాజాగా ఈ ప్రోగ్రాం చివరిదశకు వచ్చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే మరికొద్ది రోజుల్లో ప్రసారం కాబోతుంది.
గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ఉండాలన్న ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ని అతిథిగా తీసుకొచ్చారు. ఈ మేరకు ఆహా టీమ్, ప్రోమోను వదిలింది.
ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఐకాన్ స్టార్ కనిపిస్తారని, ఇంతకుముందెన్నడూ వినని ఆసక్తికర విషయాలు వినిపిస్తాయని చెబుతూ, గ్రాండ్ ఫినాలే ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Details
డ్యాన్స్ వేద్దామనుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఎంట్రీలో వచ్చే డ్యాన్స్, ఆ తర్వాత తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజంను అల్లు అర్జున్ ప్రదర్శించడం.. అంతా ఆసక్తిగా ఉంది.
ఫినాలేలో పాల్గొన్న వారిలోని ఒకరి పాట, అల్లు అర్జున్ కు బాగా నచ్చింది. ఆ పాటకు డ్యాన్స్ చేయాలనిపించిందనీ, కానీ జడ్జిగా పెద్దరికం ఇచ్చారు కాబట్టి ఆగిపోయాననీ చెప్పాడు అల్లు అర్జున్.
ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఆహా వెల్లడి చేయలేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అయినా మంచి వినోదం అందిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.
అదలా ఉంచితే, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్, రణ్వీర్ సింగ్ అతిథిగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే అతిథిగా అల్లు అర్జున్
munupennadu chudani vidhamga mana 'ICON' star..!
— ahavideoin (@ahavideoIN) May 23, 2023
Inthaku mundeppudu vinani interesting things..!#AAforTeluguIndianIdol2, Grand finAAle- Pandaga, pandaga anthe..🔥
Coming soon..#IconicFinAAle #AlluArjun #AAforTeluguIndianIdol2 @alluarjun pic.twitter.com/1Gzdfaf8G8