Page Loader
Allu Arjun: ఫోర్బ్స్ జాబితాలో అల్లు అర్జున్‌ మొదటిస్థానం.. అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా!
ఫోర్బ్స్ జాబితాలో అల్లు అర్జున్‌ మొదటిస్థానం.. అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా!

Allu Arjun: ఫోర్బ్స్ జాబితాలో అల్లు అర్జున్‌ మొదటిస్థానం.. అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప 2: ది రూల్ రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌ భారీ పారితోషికం తీసుకుని టాప్‌-1 స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. 2024లో అత్యధిక పారితోషికం పొందిన టాప్‌-10 జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో అల్లు అర్జున్‌ అత్యధికంగా రూ.300 కోట్లు తీసుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. ఈ మొత్తం పుష్ప 2 మూవీ కోసం ఆయన తీసుకున్న పారితోషికమని చెప్పింది. తమిళ హీరో విజయ్‌ రూ.275 కోట్లు, షారుక్‌ ఖాన్‌ డంకీ కోసం రూ.150-250 కోట్ల పారితోషికం తీసుకున్నారని ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఇక రజనీకాంత్‌, ఆమిర్‌ఖాన్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు ఆ నివేదక వెల్లడించింది.

Details

శ్రీలీలకు రూ.2 కోట్లు

పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలు పోషించిన రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌ కూడా భారీ పారితోషికం తీసుకున్నారు. రష్మిక రూ.10 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌ రూ.8 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పుష్ప 2లోని కిస్సిక్‌ పాటను స్టెప్పులేసిన శ్రీలీల రూ.2 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 24 గంటల్లో అత్యధికమంది వీక్షించిన సౌతిండియన్‌ పాటగా రికార్డు సృష్టించింది. పుష్ప 2 డిసెంబర్‌ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పట్నా, చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌కు విశేష స్పందన లభించింది. పట్నాలో ట్రైలర్‌ ఈవెంట్‌కు 2 లక్షల మంది అభిమానులు వచ్చారు.