Allu Arjun: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ ప్రశంస.. స్టార్ హీరోయిన్ పొగడ్తలు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న టాప్ స్టార్. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరిగిపోయింది. తాజాగా పుష్ప 2తో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ, వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో సత్తా చాటాడు. ఇప్పుడు ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని, సూపర్ హీరో కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ఇటీవల విడుదలైన వీడియో ద్వారా మేకర్స్ స్పష్టంచేశారు. దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల్లు అర్జున్‌పై ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు
Details
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
. తాజాగా ఆయనను 'టాలీవుడ్ షారుక్ ఖాన్'గా పొగిడింది హీరోయిన్ శ్రద్ధాదాస్. ఈ అందాల భామ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఈ నటి ఇప్పటివరకు పెద్ద బ్రేక్ అందుకోలేకపోయింది. అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన స్టార్‌డమ్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. 40 ఏళ్ల వయస్సుకు చేరువలో ఉన్నప్పటికీ శ్రద్ధా తన అందంతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. తాజాగా దసరా సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన చీరకట్ట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందమైన లుక్‌తో అభిమానులను కట్టిపడేస్తున్న ఈ నటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.