NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2:తమిళనాడులో పుష్ప 2 అరుదైన రికార్డు.. ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్.. ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అంటే..?
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2:తమిళనాడులో పుష్ప 2 అరుదైన రికార్డు.. ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్.. ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అంటే..?
    తమిళనాడులో పుష్ప 2 అరుదైన రికార్డు

    Pushpa 2:తమిళనాడులో పుష్ప 2 అరుదైన రికార్డు.. ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్.. ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

    ఈ అంచనాలను మరింత పెంచేందుకు ప్రమోషన్లు కూడా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

    ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా నిర్వహించగా, చెన్నైలో నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు.

    ఈ సినిమా క్రేజ్ కారణంగా భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ స్క్రీన్ కౌంట్‌తో సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం.

    చెన్నై ఈవెంట్‌లో తమిళనాడు డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూటర్ అర్చన కల్పాతి కీలక వ్యాఖ్యలు చేశారు.

    వివరాలు 

    తమిళనాడులో రికార్డ్ స్థాయిలో విడుదల 

    ఈ ఈవెంట్‌లో అర్చన కల్పాతి మాట్లాడుతూ, "మా ఏజీఎస్‌పై నమ్మకంతో ఇంత గొప్ప సినిమాను మాకు అందించిన మైత్రి నవీన్ గారికి, రవి గారికి ధన్యవాదాలు. పుష్ప 2 తమిళనాడులో 800 స్క్రీన్స్‌లో విడుదల చేయడం మాకు గర్వకారణం. మొదటి రోజు సుమారు 3500 షోలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. దర్శకుడు సుకుమార్ గారి పనితీరుపై నాకు ఎంతగానో అభిమానం ఉంది. ఆయన సినిమాలోని ఎమోషన్స్‌ను బాగా బ్యాలెన్స్ చేస్తారు. మా సబ్ డిస్ట్రిబ్యూటర్లకు, హెడ్లకు కూడా సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. డిసెంబర్ 5న సినిమాను తప్పక చూడండి" అని తెలిపారు.

    వివరాలు 

    భారీగా సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ 

    ఈ ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. సాధారణంగా తమిళనాడులో ఇతర భాషా సినిమాలకు తక్కువ స్పందన లభిస్తుంటుంది.

    కానీ పుష్ప 2 సినిమాను ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడం నిజంగా విశేషం.

    ఈ లెవల్‌లో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా అక్కడ విడుదల కాలేదు. బాక్సాఫీస్ వద్ద బన్నీ కొత్త రికార్డులు సృష్టిస్తాడా? అనేది వేచిచూడాల్సిన అంశం.

    ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. విడుదల రోజున పుష్ప రాజ్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఫస్ట్ డే ఏకంగా 3500 షోలు

    "We are releasing #Pushpa2TheRule in 600 locations, across 800 screens, with 3500 shows on DAY 1."

    - Tamilnadu Distributor, #ArchanaKalapathi. pic.twitter.com/XO5dRCZaZR

    — Gulte (@GulteOfficial) November 24, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    పుష్ప 2

    Pushpa 2: పుష్ప.. ది రూల్‌ నుంచి పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ లాంఛ్.. ఎప్పుడంటే? సినిమా
    Pushpa 2: నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే..  పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ సినిమా
    Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే సినిమా
    Pushpa 2:'సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటున్న శ్రీవల్లి.. పుష్ప 2 నుండి సెకండ్ సింగల్ విడుదల  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025