Pushpa 2 Song At NBA: NBA ఛాంపియన్‌షిప్‌లో పుష్ప 2 'పీలింగ్స్' పాటకు డ్యాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది.
ఈ సినిమా రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. తాజాగా, ఈ చిత్రంలోని "వచ్చుండాయి ఫీలింగ్స్" పాటకు నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో డ్యాన్స్ చేశారు.
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) అనేది ఉత్తర అమెరికాలో ఉన్న ప్రముఖ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్.
ఇందులో మొత్తం 30 జట్లు ఉంటాయి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లలో NBA ఒకటి. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో, ఒక మ్యాచ్‌కు ముందు చీర్ గర్ల్స్ "పుష్ప 2"లోని "వచ్చుండాయి ఫీలింగ్స్" పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్ చేశారు.
వివరాలు
ఇంటర్నేషనల్ లెవెల్‌కి అల్లు అర్జున్ క్రేజ్
ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, "అల్లు అర్జున్ క్రేజ్ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్లింది" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
NBA లో పీలింగ్స్ పాట
Peelings at @NBA 🇮🇳🔥
— GANESH_07 (@GaneshPagadala2) February 27, 2025
Global reach of Pushpa is crazy 🔥 pic.twitter.com/lB3RnRTfxm