LOADING...
Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లుక్ లీక్.. హాలీవుడ్ రేంజ్ హీరో అంటూ కామెంట్లు! 
ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లుక్ లీక్.. హాలీవుడ్ రేంజ్ హీరో అంటూ కామెంట్లు!

Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లుక్ లీక్.. హాలీవుడ్ రేంజ్ హీరో అంటూ కామెంట్లు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ 'AA22' షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ చేపట్టింది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రత్యేకత ఏమిటంటే అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ మాసివ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ అందించిన టీంలే ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. తాజాగా విడుదలైన స్పెషల్ వీడియోకి అల్లు అర్జున్ అభిమానుల నుంచి అపూర్వమైన రెస్పాన్స్ లభించింది.

Details

సూపర్ హీరో సూట్ లో అల్లు అర్జున్

ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మరోవైపు సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచే అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అల్లు అర్జున్ సూపర్ హీరో సూట్‌లో, జుట్టును ముడివేసుకున్న లుక్‌లో కనిపిస్తున్నారు.

Details

హాలీవుడ్ రేంజ్ హీరో అంటూ పొగడ్తలు

ఈ ఫోటో చూసి అభిమానులు హాలీవుడ్ రేంజ్ సినిమా రాబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద హైప్ ఆకాశాన్ని తాకుతోంది. AA22 చిత్రీకరణను 2026 మధ్యలో పూర్తిచేసి, 2027లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలిసారి సూపర్ హీరో కాన్సెప్ట్‌లో వస్తోన్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి తమిళ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.